గవర్నర్ ఎట్ హోం కు కాంగ్రెస్ దూరం…!

గణతంత్ర దినోత్సవం సందర్భంగా గవర్నర్ నరసింహన్ రాజ్ భవన్ లో ఈరోజు నిర్వహిస్తున్న ఎట్ హోం కార్యక్రమానికి కాంగ్రెస్ దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. గవర్నర్ నిర్వహించే ఎట్ మోం కార్యక్రమానికి హాజరు కాకూడదని నిశ్చయించింది. గవర్నర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ ఆరోపించింది. ఈ నేపథ్యంలో గవర్నర్ నిర్వహించే కార్యక్రమానికి హాజరుకాకూడదని నిర్ణయించింది. ఇటీవల ఇసుక మాఫియా పై గవర్నర్ కు ఫిర్యాదుచేయడానికి వెళ్లిన కాంగ్రెస్ నేతలకు చుక్కెదురైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా గవర్నర్ కు, కాంగ్రెస్ నేతలకు మధ్య వాడి వేడిగాచర్చ జరిగింది. అంతేకాకుండా గవర్నర్ నరసింహన్ కేసీఆర్ పాలనను విపరీతంగాపొగుడుతుండటాన్ని కూడా కాంగ్రెస్ తప్పుపడుతోంది. అందుకే గవర్నర్ ఎట్ హోం కార్యక్రమానికి దూరంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు గాంధీ భవన్ లో ఉత్తమ్ అధ్యక్షతనజరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*