జగన్ పార్టీ రాజీనామాలు డ్రామాలా?

జగన్ పార్టీ ఎంపీలు రాజీనామాలు చేయడం ఉత్త డ్రామాలని తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. పోరాటంలో వెనకపడి పోయామనే ఈ రాజీనామాల నాటకానికి తెరలేపారన్నారు. ఏప్రిల్ 6న రాజీనామాలు చేస్తే వాటిని ఆమోదించడానికి రెండు నెలల సమయం పడుతుందన్నారు. ఈలోగా ఎన్నికలు వస్తాయని తెలిసే ఆ తేదీ ప్రకటించారని జేసీ ఎద్దేవా చేశారు. ఈ రాజీనామాల వల్ల ఉపయోగం ఉండదని జేసీ అన్నారు. రెండేళ్ల క్రితం రాజీనామాలు ఏమయ్యాయన్నారు. ఈ రాజీనామాలను ప్రజలు నమ్మరని జేసీ అన్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


UA-88807511-1