టీడీపీకి సీన్ లేదని అర్థమైందన్న పవన్

pawankalyan janasenaparty

ప్రత్యేక హోదా సాధించే స్థితిలో టీడీపీ లేదని అర్థమయిపోయిందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. అమిత్ షా లేఖకు చంద్రబాబు సుదీర్ఘంగా సమాధానంచెప్పారని, పరిస్థితి చూస్తుంటే కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వదని అర్థమయిందన్నారు. ప్రస్తుతం ఏపీలో నెలకొన్న రాజకీయ అనిశ్చితికి రెండు పార్టీలూ కారణమని చెప్పారు. భవిష్యత్ కార్యాచరణపై వామపక్షాలతో చర్చిస్తానని చెప్పారు. జేపీతో సహా సీనియర్ల సలహాలు తీసుకుంటామని చెప్పారు. ప్రభుత్వం కేంద్రాన్ని నిలదీయలేకపోతుందన్నారు. ప్రజల అభీష్టం మేరకు తన నిర్ణయం ఉంటుందన్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*