డ్రామాలు కట్టిపెట్టండి

కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టే విషయంలో టీడీపీ, వైసీపీలు డ్రామాలాడుతున్నాయని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. ప్రత్యేక హోదా అంశంపై టీడీపీ, వైసీపీ విడివిడిగా అవిశ్వాసం పెట్టడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. అవిశ్వాసం పెట్టే విషయంలో టీడీపీ, వైసీపీలు తేదీలను వెనక్కు, ముందుకు లాగడమెందుకని ఆయన ప్రశ్నించారు.