దీక్షకు రెడీ అవుతున్న వైసీపీ ఎంపీలు

Ysrcp fighting on Bogus votes

ఏపీభవన్ లో తమ ఆమరణ దీక్షకు అనుమతివ్వాలని కోరుతూ వైసీపీ పార్లమెంటు సభ్యులు ఏపీ రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ ప్రకాష్ కు వినతి పత్రం ఇచ్చారు. లోక్ సభ ఇంకా నాలుగురోజులే కొనసాగనుంది. ఏప్రిల్ 6వ తేదీతో లోక్ సభ సమావేశాలు ముగియనున్నాయి. లోక్ సభ సమావేశాలు వాయిదా పడిన వెంటనే వైసీపీ ఎంపీలు రాజీనామాలు చేసి ఏపీ భవన్ లో ఆమరణ దీక్షకు దిగనున్నారు. తమ ఆమరణ దీక్షకు అనుమతివ్వాలని ఏపీ భవన్ అధికారులను కోరినట్లు వైవీ సుబ్బారెడ్డి, వరప్రసాద్, మేకపాటి రాజమోహన్ రెడ్డి తదితరులు తెలిపారు. ఏపీభవన్ దీక్షకు ఎక్కడ దిగాలో అన్నది పరిశీలించారు. ఆమరణ దీక్షకు వైసీపీ ఎంపీలు రెడీ అయిపోతున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*