నన్ను బోనులోకి ఎక్కిస్తారా?

ఆర్థిక నేరగాళ్లు ప్రధాని మంత్రి కార్యాలయంలో ఎందుకు వస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశ్నించారు. తనను బోనులోకి ఎక్కించేంత వరకూ పీఎంలోనే ఉంటానని విజయసాయి రెడ్డి చెబుతున్నారని, పీఎంలోనే కాపురం పెట్టుకోమని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక అవినీతి పరుడు ప్రధానిని కలిస్తే ఎలా అని అన్నారు. శాసన మండలిలో చంద్రబాబు మాట్లాడారు. ఎవరైనా నేరగాడు తనను కలుస్తున్నారా? అని నిలదీశారు. మాజీ నేరస్థుడు సీబీఐ డైరెక్టర్ ను కలిస్తేనే కేసుపెట్టారని, పీఎంఓ అలాంటి వారిని ఎలా అనుమతిస్తుందని అన్నారు. తానేమీ గొంతెమ్మ కోర్కెలను కోరడం లేదని, తనపై ఎలాంటి కేసైనా పెట్టుకోమని కోరారు. పరిపాలనలో తన కుమారుడు లోకేష్ జోక్యం చేసుకున్నా తాను అంగీకరించనన్నారు. తన జీవితం తెరిచిన పుస్తమని చెప్పారు.

1 Comment on నన్ను బోనులోకి ఎక్కిస్తారా?

Leave a Reply

Your email address will not be published.


*