నాకే పాపం తెలియదు : సల్మాన్

నాకే పాపం తెలియదని…నన్ను కావాలనే ఈ కేసులో ఇరికించారని ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ తెలిపారు. ఆయన శుక్రవారం జోధ్ పూర్ కోర్టుకు హాజరై తన వాంగ్మూలాన్ని కోర్టుకు నివేదించారు. కృష్ణజింకల వేట కేసు ఇంకా సల్మాన్ వదలలేదు. ఇది 19 ఏళ్లుగా న్యాయస్థానాల్లో నడుస్తూనే ఉంది. 1998 లో హమ్ సాథ్ సాథ్ హై సినిమా షూటింగ్ సమయంలో తన సన్నిహితులతో కలిసి సల్మాన్ కృష్ణజింకలను వేటాడినట్లు కేసు నమోదయింది. ఈ కేసులో సల్మాన్ తో పాటుగా సైఫ్ ఆలీఖాన్, సోనాలి బింద్రే, టబు లు కూడా నిందితులుగా ఉన్నారు.

అయితే తాను వేటకే అసలు వెళ్లలేదని, షూటింగ్ అయిపోయిన వెంటనే తాను హోటల్ గదికి వచ్చి రెస్ట్ తీసుకున్నట్లు సల్మాన్ కోర్టుకు తెలిపారు. వాస్తవానికి ఈ నెల25వతేదీనే సల్మాన్ కోర్టుకు వాంగ్మూలం ఇవ్వాల్సి ఉంది. అయితే రిపబ్లిక్ డే సందర్భంగా 27న సల్మాన్ కోర్టుకు హాజరయ్యారు. మొత్తం 25 మంది ఈ కేసులో సాక్ష్యాలను ఇచ్చారు. దాని ఆధారంగా తయారుచేసిన 65 ప్రశ్నలకు కండలవీరుడు సల్మాన్ సమాధానమిచ్చారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*