బస్సులు ఢీ: 120 మందికి గాయాలు

విశాఖలోని యారాడ కొండపై తృటిలో ఘోర ప్రమాదం తప్పింది. అనకాపల్లి ఉడ్ పేటకు చెందిన సిటీ పబ్లిక్ స్కూల్ యజమాన్యం నాలుగు బస్సుల్లో 200 మంది విద్యార్థులు, 30 మంది సిబ్బందితో కలసి శనివారం ఉదయం యారాడ విహారయాత్రకు వెళ్లారు. మధ్యాహ్నం లైట్ హౌస్ వద్దభోజనాలు చేసి విద్యార్థులంతా యారాడ తీరానికి బస్సుల్లో బయలుదేరారు. నాలుగు బస్సులు వరుసగా ఘాట్ రోడ్లో కిందకు దిగుతున్న సమయంలో మూడో బస్సు బ్రేకులు ఫెయిల్ అయ్యాయి. దాన్ని ఆపేందుకు ముందు వెళ్తున్న బస్సులను డ్రైవర్లు ఆపారు. దీంతో ఆ బస్సు ముందున్న రెండు బస్సులను బలంగా ఢీకొని నిలిచిపోయింది. ఈ ప్రమాదంలో 120 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆర్టీసీ బస్సు, అంబులెన్సులో విశాఖలోని కేజీహెచ్, అనకాపల్లి, అగనంపూడి ఆసుపత్రికి తరలించారు. సమాచారం తెలిసిన వెంటనే జిల్లా అధికార యంత్రాంగం, నేవీ అధికారులు ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*