బ్రేకింగ్ : వంగవీటి వద్దకు వైసీపీ దూత

vangaveeti radha in bezwada politics

వంగవీటి రాధాతో వైసీపీ సీనియర్ నేత పార్థసారధి భేటీ అయ్యారు. సెంట్రల్ సీటు విషయం వదిలేయమని, తూర్పు నియోజకవర్గం, బందరు పార్లమెంటు స్థానంలో పోటీచేసే విషయం ఆలోచించాలని రాధాకు పార్థసారధి నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు. అధిష్టానం అన్నీ ఆలోచించే ఈ నిర్ణయం తీసుకుందన్నారు. అయితే వంగవీటి రాధా మాత్రం సెంట్రల్ సీటు తప్ప తాను ఎక్కడా పోటీ చేయనని తెగేసి చెప్పారు. తనకు సీటు ఇవ్వకుంటే తన అనుచరులతో సమావేశమై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దని రాధాకు పార్థసారధి సూచించారు. అధిష్టానం తనను పంపితేనే వచ్చానని, వైసీపీలోనే కొనసాగాలని పార్థసారధి చెప్పారు. మరి రాధా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*