మాజీ ఎంపీ ఉండవల్లి అరెస్ట్

ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న సాగునీటి ప్రాజెక్టులో అవినీతిపై చర్చించేందుకు విజయవాడ వచ్చిన మాజీ పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. సెక్షన్ 30 అమలులో ఉండగా చర్చకు అనుమతిచ్చేది లేదని పోలీసులు చెప్పారు. ఆయనను అరెస్ట్ చేసి కృష్ణలంక పోలీసు స్టేషన్ కు తరలించారు. పట్టిసీమ, పోలవరం ప్రాజెక్టుల్లో అవినీతి జరిగిందని ఉండవల్లి ఆరోపించిన సంగతి తెలిసిందే. దీనికి బహరింగ చర్చకు సిద్ధమని ఉండవల్లి సవాల్ విసిరారు. ఉండవల్లి సవాల్ కు స్పందించిన టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి చర్చకు సిద్ధమన్నారు. కృష్ణా బ్యారేజి ని వేదికగా నిర్ణయించుకున్నారు. అయితే వీరిద్దరి చర్చకు పోలీసులు అనుమతించలేదు.

1 Comment on మాజీ ఎంపీ ఉండవల్లి అరెస్ట్

  1. ఉండవల్లి అరుణ్ కుమార్ విసిరిన సవాలును, గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్పందించి ప్రతి సవాల్ ను విసిరినప్పుడు చర్చా వేదిక పెడితే, నిజానిజాలు తేలతాయి కదా ! ఇటువంటి సవాళ్ళను, ప్రతి సవాళ్ళను ఆమోదించి చర్చలు ఎందుకని జరుపరో నాకిప్పటికీ అర్థం కాని విషయం. ఇది జనాల్ని పిచ్చోళ్ళని చేయడానికి ఆడుతున్న నాటకాలనే విషయం సుస్పష్టం. అందరూ నాటకాల రాయుళ్ళే. ఎవరికి వాళ్ళు వ్యక్తిగత మీటింగ్స్ పెట్టుకుని వాడిట్లా చేశాడు, వీడిట్లా చేశాడని ఒకళ్ళమీద ఇంకొకరు నిందారోపణలు చేసుకుంటారు కానీ, ఓకే స్టేజీ మీద కొచ్చి, రాజకీయ యుద్ధం చేసిన సందర్భాలు చాలా చాలా అరుదు. ఇది జనాల‌ను పిచ్చోళ్ళని చేసి ఆడించే ఒక నాటక ప్రక్రియ.

Leave a Reply

Your email address will not be published.


*


UA-88807511-1