మూడేళ్ళ నందుల జాబితా మీ కోసం!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒకేసారిగా… 2014 , 2015 మరియు 2016 సంవత్సరాలకు గాను నంది అవార్డులను మీడియా సమక్షంలో ప్రకటించింది. ఈ మూడేళ్లకు నంది అవార్డులతోపాటు… నాగిరెడ్డి, చక్రపాణి జాతీయ, రఘుపతి వెంకయ్య సినిమా పురస్కారాలను కూడా ప్రకటించింది. రెండేళ్ల ఉత్తమ హీరో పురస్కారాలను నందమూరి హీరోలు ఎగరేసుకుపోగా… మరోయేడాది ఉత్తమ హీరో పురస్కారాన్ని సూపర్ స్టార్ మహేష్ ఎగరేసుకుపోయాడు. 2014 కు గాను ఉత్తమ చిత్రంగా లెజెండ్ సినిమా ఎంపిక చెయ్యగా…. అందులో హీరోగా నటించిన బాలకృష్ణ ని ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు. అయితే 2015 కు బాహుబలి ఉత్తమ చిత్రంగా ఎంపికయ్యింది. అలాగే 2015 కు గాను ఉత్తమ నటుడిగా మహేష్ బాబు నంది అవార్డుని కైవసం చేసుకున్నాడు. ఇక 2016 సంవత్సరానికి ఉత్తమ చిత్రంగా పెళ్ళిచూపులు ఎంపికవగా… ఉత్తమ నటుడిగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎంపికయ్యాడు.

2014 నంది అవార్డులు:

ఉత్తమ చిత్రం- లెజెండ్‌
ఉత్తమ ద్వితీయ చిత్రం : మనం
ఉత్తమ నిర్మాత – ఆచంట రామబ్రహ్మం
ఉత్తమ డైరెక్టర్ – బోయపాటి శ్రీను
ఉత్తమ నటుడు – నందమూరి బాలకృష్ణ
ఉత్తమ నటి : అంజలి

ఎన్టీఆర్ నేష‌న‌ల్ అవార్డు- క‌మ‌ల్‌హాసన్
బీఎన్ రెడ్డి జాతీయ పుర‌స్కారం- ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి
నాగిరెడ్డి-చ‌క్ర‌పాణి జాతీయ సినిమా అవార్డు- న‌టుడు ఆర్‌.నారాయ‌ణ మూర్తి
ర‌ఘుప‌తి వెంక‌య్య పుర‌స్కారం- సీనియ‌ర్ న‌టుడు కృష్ణం రాజు
స్పెషల్ జ్యూరీ అవార్డు- గేయ ర‌చ‌యిత సుద్దాల అశోక్ తేజ‌

2015 నంది అవార్డులు:

ఉత్తమ చిత్రం- బాహుబలి 1
ఉత్తమ కుటుంబ కథాచిత్రం- మళ్ళీ మళ్లీ రానిరోజు
ఉత్తమ ద్వితీయ చిత్రం- ఎవడే సుబ్రమణ్యం
ఉత్తమ తృతీయ చిత్రం- నేను శైలజ
బెస్ట్‌ ఫీచర్‌ ఫిల్మ్‌- కంచె
ఉత్తమ నటుడు- మహేష్‌బాబు
ఉత్తమ నటి అనుష్క
ఉత్తమ దర్శకుడు రాజమౌళి

ఎన్టీఆర్ నేష‌న‌ల్ అవార్డు- ద‌ర్శ‌కుడు రాఘ‌వేంద్ర రావు
బీఎన్ రెడ్డి జాతీయ పుర‌స్కారం- త్రివిక్ర‌మ్ శ్రీనివాస్‌
నాగిరెడ్డి-చ‌క్ర‌పాణి జాతీయ సినిమా అవార్డు- ఎమ్.ఎమ్. కీర‌వాణి
ర‌ఘుప‌తి వెంక‌య్య పుర‌స్కారం- ప‌బ్లిసిటీ డిజైన‌ర్ ఈశ్వ‌ర్‌
స్పెషల్ జ్యూరీ అవార్డు – పీసీ రెడ్డి

2016 నంది అవార్డులు:

ఉత్తమ చిత్రం – పెళ్లిచూపులు
ద్వితీయ ఉత్తమ -చిత్రం – అర్ధనారి
తృతీయ ఉత్తమ- చిత్రం – మనలో ఒకడు
ఉత్తమ నటుడు – జూనియర్‌ ఎన్టీఆర్‌

ఎన్టీఆర్ నేష‌న‌ల్ అవార్డు- ర‌జినీకాంత్‌
బీఎన్ రెడ్డి జాతీయ పుర‌స్కారం- బోయ‌పాటి శ్రీను
నాగిరెడ్డి-చ‌క్ర‌పాణి జాతీయ సినిమా అవార్డు- కేఎస్ రామారావు
ర‌ఘుప‌తి వెంక‌య్య పుర‌స్కారం- చిరంజీవి
స్పెషల్ జ్యూరీ అవార్డు – ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్‌

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


UA-88807511-1