మేమంతా త్యాగరాజులమే….!

తెలుగుదేశం పార్టీ త్యాగాలకు వెనకాడదని ఏపీ మంత్రులు స్పష్టం చేశారు. మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, అచ్చెన్నాయుడులు మాట్లాడుతూ మిత్రపక్షంగా ఉన్నప్పటికీ కేంద్రంపై పోరాటం చేశామన్నారు. మోడీకి చంద్రబాబు భయపడతున్న మాటల్లో వాస్తవం లేదన్నారు. ఏపీ ప్రయోజనాల కోసమే బీజేపీతో పొత్తు పెట్టుకున్నామన్నారు. ప్రత్యేక హాదా స్థానంలో ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామంటే ఒప్పుకున్నామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు 29 సార్లు ఢిల్లీకి వెళ్లి కలిసినా ప్రయోజనం లేకపోవడంతో ఆందోళన బాట పట్టామన్నారు. 2016 బడ్జెట్ సమయంలో వైసీపీ అధ్యక్షుడు జగన్ తమ ఎంపీల చేత రాజీనామా చేయిస్తామన్నారని, అయితే మూడు బడ్జెట్ ల తర్వాత రాజీనామాలను మరోసారి తెరపైకి తెచ్చామన్నారు. తమకు పెదవులు పెద్ద విషయం కాదన్నారు. ఆరోజు వాజపేయి ప్రభుత్వంలో కూడా తాము పదవులు చేపట్టలేదన్నారు. ఏపీ ప్రయోజనాల కంటే రాజకీయాలు తమకు ముఖ్యం కాదన్నారు. క్రిమినల్స్ చాలా మంది ఉన్నారు కాని జగన్ లాంటి క్రిమినల్ ఎక్కడా ఉండరన్నారు. ఏడాదికి ముందు రాజీనామాలు చేస్తే ఎన్నికలు రావనే ఈ నాటకానికి తెరతీశారన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వరని తెలిసి కూడా ప్రజలను మభ్య పెట్టేందుకే రాజీనామాల ప్రకటన జగన్ చేశారన్నారు. అవసరమొస్తే తాము రాజీనామాలు చేయడానికి ఎప్పుడూ వెనకాడబోమన్నారు. కేంద్రంలో ఉన్న మంత్రులు కూడా పదవుల కోసం ఉండటం లేదన్నారు. వారి శాఖలు కూడా ప్రజలకు ఎవరూ తెలియవన్నారు. తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదన్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


UA-88807511-1