యూపీలో మజ్లిస్ పాగా

ys jaganmohanreddy asauddin ovaisi

ఉత్తరప్రదేశ్ లో ఎంఐఎం పాగా వేసింది. ఉత్తరప్రదేశ్ లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ 30 స్థానాల్లో ఘన విజయం సాధించడం విశేషం. ఉత్తరప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల్లో ఎంఐఎం మొత్తం 78 స్థానాల్లో పోటీ చేసింది. ఇందులో 30 స్థానాల్లో ఘన విజయం సాధించింది. దస్నా మున్సిపల్ ఛైర్మన్ పదవిని మజ్లిస్ పార్టీ కైవసం చేైసుకుంది. ఆ మున్సిపల్ ఛైర్మన్ హజ్జస్ హంసార్ ఎన్నికయ్యారు. ఫిరోజా బాద్ మున్సిపల్ కార్పొరేషన్లలో పది డివిజన్లు, మీరట్ లో రెండు, కాన్పూరు, అలహాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లలో ఒకొక్క స్థానాన్ని గెలుచుకున్నట్లు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ చెప్పారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*