రాములమ్మ రెడీ అయిపోయారు….!

ఎన్నికల్లో తనకు పోటీ చేయాలని లేదని, రాహుల్ పోటీ చేయమంటున్నారు కాబట్టి చేస్తానని కాంగ్రెస్ నేత విజయశాంతి అన్నారు. విజయశాంతి కేసీఆర్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. తాను రాజకీయాల్లోకి వచ్చి రేపటికి ఇరవై ఏళ్లు అవతుందన్నారు. కేసీఆర్ సర్కార్ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణాగా మారుస్తుందేమోనని ఇంతవరకూ చూశానని, కాని ఇత్తడి తెలంగాణలాగా కూడా మార్చలేదని ఎద్దేవా చేశారు. తెలంగాణ కోసం ఉద్యమం చేసిన వారిని జైలులో పెట్టడమేంటని ప్రశ్నించారు. తాను కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉన్నమాట వాస్తవమేనని, అయితే కాంగ్రెస్ పెద్దలతో టచ్ లోనే ఉన్నానని చెప్పారు. తాను త్వరలోనే ప్రజ్లలోకి వెళతానని, ప్రభుత్వం అందుకు అనుమతిస్తుందో లేదో చూడాలని అన్నారు. బీజేపీ ప్రభావం రాష్ట్రంలో ఏమాత్రం ఉండదన్నారు. జయశంకర్ సార్ చెప్పడం వల్లనే ఆరోజు తన పార్టీని టీఆర్ఎస్ లో విలీనం చేశానన్నారు. తాను కేవలం తన నియోజకవర్గానికి మాత్రమే ఈసారి పరిమితం కాబోనని, రాష్ట్ర వ్యాప్త పర్యటన చేస్తానని చెప్పారు. మరి అది పాదయాత్రా? బస్సుయాత్రా? అన్నది హైకమాండ్ తేలుస్తుందన్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*