Thu Mar 28 2024 14:46:07 GMT+0000 (Coordinated Universal Time)
రేవంత్ కాంగ్రెస్ లో ఎప్పుడు చేరతారంటే....?
టీటీడీపీకి రాజీనామా చేసిన రేవంత్ ఈ నెల31న కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఈరోజు కొడంగల్ లో ముఖ్య అనుచరులతో సమావేశమైన అనంతరం కాంగ్రెస్ నేతలతో భేటీ కానున్నారు. ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్ ఛార్జి కుంతియా హైదరాబాద్ కు రానున్నారు. రేవంత్ రెడ్డి ఈరోజు మధ్యాహ్నం కుంతియా, ఉత్తమ్, జానారెడ్డి తదితర కాంగ్రెస్ సీనియర్ నేతలతో భేటీ అవుతారు. అనంతరం కుంతియా వెంట ఢిల్లీ వెళ్ల నున్నారు. ఈ నెల 31న ఢిల్లీలో రాహుల్ గాంధీ సమక్షంలో రేవంత్ కాంగ్రెస్ లో చేరనున్నారు. నవంబర్ నెల రెండో వారంలో కాంగ్రెస్ అధినేతగా రాహుల్ తెలంగాణకు రానున్నారు. రాహుల్ సభ ఏర్పాట్లపైన కూడా రేవంత్, ఉత్తమ్ లు చర్చించే అవకాశముంది.
- Tags
- రేవంత్ రెడ్డి
Next Story