Fri Apr 26 2024 21:38:42 GMT+0000 (Coordinated Universal Time)
రేవంత్ విశ్వసనీయత లేని లీడరా?
రేవంత్ రాజీనామా విషయం మరోసారి ప్రస్తావనకు వచ్చింది. తెలుగుదేశం పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరుతున్నప్పుడు రేవంత్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. అయితే ఇటీవల రేవంత్ అధికార పార్టీపై విరుచుకు పడుతుండటంతో పార్లమెంటు సభ్యుడు బాల్క సుమన్ మరోసారి లేవనెత్తారు. రేవంత్ విశ్వసనీయత లేని వ్యక్తి అని సుమన్ అన్నారు. సినిమాల్లో లాగా ప్రెస్ నోట్లు వదలడం తప్ప రేవంత్ వద్ద ఎలాంటి ఆధారాలు లేకుండా మాట్లాడతారన్నారు. విద్యుత్తు కొనుగోళ్లపై తాము చర్చకు సిద్ధమని, అయితే రేవంత్ తో చర్చించబోమన్నారు. పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత జానారెడ్డి, షబ్బీర్ అలీలు వస్తే తాము చర్చకు సిద్ధమన్నారు. అంతే తప్ప రేవంత్ లాంటి విశ్వసనీయత లేని వ్యక్తితో తాము మాట్లాడబోమన్నారు. ఇప్పటికి అనేక పార్టీలు మారిన రేవంత్ రేపు కాంగ్రెస్ లో ఉంటారో లేదో కూడా తెలియదన్నారు.
- Tags
- రేవంత్ రెడ్డి
Next Story