నిరుద్యోగులకు తీపికబురు

తెలంగాణలో నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త ప్రకటించింది. ఇటీవల భారీ సంఖ్యలో ఎస్సై, కానిస్టేబుల్ పోస్టుల భార్తీకి విడుదలైన నోటిషికేషన్ లో వయోపరిమితిని మూడేళ్లు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పోలీసు శాఖ సవరణ నోటిఫికేషన్ విడుదల చేసింది. 2015లో వచ్చిన పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ లో కూడా మూడేళ్లు వయోపరిమితి సడలింపు ఇచ్చారు. కానీ, ఈ నోటిఫికేషన్ లో మొదట ఎటువంటి సడలింపు ప్రకటించలేదు. దీంతో నిరుద్యోగులు ఆందోళన బాట పట్టారు. ధర్నాలు చేశారు. దీంతో ప్రభుత్వం స్పందించి సానుకూల నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో అదనంగా సుమారు 30 వేల మందికి పోటీ పడే అవకాశం లభించనుందని అంచనా.

Sandeep
About Sandeep 6128 Articles
Sandeep Reddy started his work in journalism at the age of 19 as a local reporter in leading telugu news paper. Later he worked as staff reporter. He has 9 years of experience in print and social media.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*