నాకు అంత ఖర్మ పట్టలేదు

akhilapriya comments on party change

తెలుగుదేశం పార్టీని వీడి జనసేన పార్టీలో చేరుతున్నారనే ప్రచారాన్ని మంత్రి అఖిలప్రియ ఖండించారు. తాను తెలుగుదేశం పార్టీని వీడేది లేదని, రానున్న ఎన్నికల్లో ఆళ్లగడ్డ టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి గెలిచి విజయాన్ని చంద్రబాబుకు కానుకగా ఇస్తానని స్పష్టం చేశారు. జనసేనలోకి వెళ్లాల్సిన ఖర్మ తనకు పట్టలేదని పేర్కొన్నారు. పోలీసులు తన అనుచరులను వేదిస్తున్నందునే గన్ మెన్లను వెనక్కు పంపాను కానీ పార్టీపై ఎటువంటి వ్యతిరేకత లేదని స్పష్టం చేశారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*