బ్రేకింగ్ : ఉద్యోగానికి అలోక్ వర్మ రాజీనామా

telugu post telugu news

సీబీఐ వివాదంలో అనేక ట్విస్ట్ లు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా అలోక్ వర్మను సెలవుపై పంపించడాన్ని తప్పుపట్టిన సుప్రీంకోర్టు ఆయనను సీబీఐ డైరెక్టర్ గా కొనసాగించాలని ఆదేశాలు ఇచ్చింది. దీంతో అలోక్ వర్మ మళ్లీ సీబీఐగా బాధ్యతలు తీసుకున్న విషయం తెలిసిందే. అయితే, అలోక్ వర్మపై వచ్చిన ఆరోపణలు నిజమేనంటూ హైపవర్ కమిటీ సీబీఐ డైరెక్టర్ పదవి నుంచి ఒక్కరోజులోనే అలోక్ వర్మను తప్పించింది. అలోక్ వర్మను అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్ గా బదిలీ చేసింది. అయితే, ఆ పదవి తీసుకోవడానికి ఇష్టపడని అలోక్ వర్మ ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఇక, సీబీఐ కొత్త డైరెక్టర్ గా నాగేశ్వరరావు ఇవాళ బాధ్యతలు స్వీకరించారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*