అమరావతిలో మరో ముందడుగు….!!!

amaravathi capital consturction

అమరావతిలోని రాజధాని నిర్మాణంలో మరో ముందడుగుపడింది.ఐకానిక్ టవర్ల నిర్మాణంలో రెండో టవర్ కు ఈరోజు కాంక్రీట్ పనులను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రారంభించారు. ర్యాఫ్ట్ ఫౌండేషన్ పనులు ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు నిర్విరామంగా ఈ కాంక్రీట్ పనులు జరుగుతాయి. 225 మీటర్ల ఎత్తు అడుగులో ప్రపంచంలో కెల్లా ఎత్తైన సచివాలయం నిర్మితమవుతుంది. మొత్తం ఐదు టవర్లలో సచివాలయాన్ని నిర్మిస్తారు. 69 లక్షల చదరపు అడుగుల్లో ఐకానిక్ టవర్ల నిర్మాణం జరగనుంది. అత్యాధునిక సౌకర్యాలతో ఈ సచివాలయాన్ని నిర్మించనున్నారు. ఇప్పటి వరకూ తాత్కాలిక సచివాలయం మాత్రమే ఉన్న అమరావతికి శాశ్వత సచివాలయం నిర్మాణ పనులు వేగవంతమయ్యాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*