అమెరికా వెళ్లేవారికి శుభవార్త

భారత్ నుంచి అమెరికాకు వెళ్లేవారికి ఇది నిజంగా శుభవార్త. త్వరలో మనదేశంలో తన సేవలను ప్రారంభించనున్న ఐస్ ల్యాండ్ కి చెందిన ‘వావ్ ఎయిర్‘ ఎయిర్ లైన్స్ సంస్థ అమెరికా ప్రయాణికులకు ఓ బంపర్ ఆఫర్ ప్రకటించింది. కేవలం 199 డాలర్ల(సుమారు 14 వేల రూపాయలు) బేసిక్ టిక్కెట్ ధరతో అమెరికా ప్రయాణ అవకాశం కల్పిస్తున్నట్లు వావ్ ఎయిర్ సంస్థ సీఈఓ స్కూలి మోగన్ సెన్ తెలిపారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ… డిసెంబరు 7 నుంచి తమ సర్వీసులు ప్రారంభమవుతాయని తెలిపారు. ఢిల్లీ నుంచి ఉత్తర అమెరికాలోని 15 నగరాలకు తమ ఫ్లైట్ సర్వీసులు నడపనున్నట్లు తెలిపారు. కాగా, ఐస్ ల్యాండ్ రాజధాని రెక్జావిక్ మీదుగా ఈ సర్వీసులు నడువనున్నాయి. ఇక ప్రీమియం టిక్కెట్ ధరను మాత్రం సుమారు రూ.46 వేల వరకు ఉండే అవకాశం ఉంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*