ఏపీకి కేంద్రం తీపికబురు

narendramodi prime minister of india

ఆంధ్రప్రదేశ్ కు కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలిసింది. అనంతపురం జిల్లాలోని జంతులూరులో  సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకు సంబంధించిన బిల్లు వచ్చే పార్లమెంటు సమావేశాల్లోనే ప్రవేశపెట్టనున్నారు. విభజన హామీల అమలులో భాగంగా రాష్ట్రానికి రూ.902 కోట్లతో యూనివర్సిటీ ని మంజూరు చేశారు. యూనివర్సిటీ పేరు ‘ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం’గా ఉండనుంది. ఈ మేరకు బుధవారం కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ ప్రకటన చేశారు. పూర్తిస్థాయి యూనివర్సిటీ నిర్మాణం అయ్యేవరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేటాయించే తాత్కాలిక భవనంలో యూనివర్సిటీ కొనసాగనుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*