జగన్ విషయంలో ప్రభుత్వం ఇరకాటంలో పడిందా..?

twist in jagan case

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పడు ఇరుకాటంలో పడింది. రెండు సంఘటనలపైన ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందాలు ఇప్పడు ఆటకెక్కాయి. రెండు కేసులను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఏపీ ప్రభుత్వం వాటిని కేంద్రానికి దారాదత్తం చేసింది. ఎమ్మెల్యే కిడారి హత్యతో పాటు జగన్ పైన ఎయిర్ పొర్టులో దాడి చేసిన ఘటనలపైన ఏపీ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేసింది. ఈ రెండింటికి కూడా డీఐజీ స్థాయి అధికారులను నియమించింది. అయితే ఈ రెండు కేసుల్లో కూడా కేంద్రం చాలా దూకుడుగా వ్యవహరించి కేంద్ర సంస్థలను విచారణకు ఆదేశించింది.

ఎన్ఐఏ చేతికి జగన్ పై దాడి కేసు

జగన్ పైన ఎయిర్ పొర్టులో కత్తితో శ్రీనివాస్ రావు దాడి చేశారు.. ఈ దాడి ఘటనను వైజాగ్ పోలీసులు వెంటనే విచారణ చెపట్టారు. దాడి జరిగిన అరగంటలోనే పోలీసులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఇది కేవలం పబ్లిసిటీ కోసమే అంటూ చెప్పారు. అంతేకాకుండా దాడి చేసిన శ్రీనివాస్ రావు వైసీపీకి చెందిన కార్యకర్తని తెలిపారు. వైసీపీ దీనిపైన పొరాటం చేయడంతో వెంటనే ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఏపీ పోలీసులు సాక్ష్యాలను తారుమారు చేస్తారని, ఏపీ పోలీసుల విచారణ పైన నమ్మకం లేదని, కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండే ఎయిర్ పొర్టులో దాడి జరిగింది కాబట్టి విచారణను కేంద్రం పరిధిలోని విచారణ సంస్థలకు అప్పగించాలని వైసీపీ డిమాండ్ చేసింది. దీనికి తోడు హైకోర్టులో కూడా కేసు దాఖలు చేసింది. దీంతో హైకోర్టు ఎన్ఐఏ విచారణకు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సీట్ ఇప్పడు ఈ కేసును తప్పనిసరిగా కేంద్రానికి అప్పగించవలసి వస్తుంది.

అరకు ఘటనపైనా…

అరకులో ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావుతో పాటు మాజీ ఎమ్మెల్యే సొములను మావోయిస్టులు హత్య చేశారు. ఈ కేసుపైన కూడా ఏపీ ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేసింది. ఈ కేసులో ఏపీ సిట్ చాలా దూకుడుగా పొయింది. ఇప్పటికే కేసులో చాలామందిని సిట్ విచారణ జరిపి అరెస్టు కూడా చేసింది. మావోయిస్టుల దాడులు, హత్యాకాండలపైన తప్పనిసరిగా ఎన్ఐఏ చెతనే విచారణ చేయించాలని కేంద్రం గతంలో నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఎన్ఐఏ ఈ కేసును విచారిస్తోంది. దీంతో ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ నిర్వీర్యం అయ్యింది. సిట్ ఇప్పటివరకు చేసిన విచారణ మొత్తం కూడా ఎన్ఐఏకి అప్పగించవలసి వచ్చింది. ఏదైమైనా ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ బృందాల పని సగంలోనే ఆగిపోయింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*