అద్భుత రీతిలో అర్ధ కుంభమేళాకు ఏర్పాట్లు

ప్రయాగరాజ్ గా పేరు మార్చిన తరువాత తొలిసారి అర్ధ కుంభమేళాకు వేదికగా నిలుస్తుంది అర్దకుంభమేళా. మకర సంక్రాంతి నుంచి మహా శివరాత్రి వరకు అర్దకుంభమేళా సాగనుంది. త్రివేణి సంగమ ప్రాంతమైన అలహాబాద్ ఇప్పుడు ప్రపంచ ఆధ్యాత్మిక వేత్తలతో లక్షలాదిమంది భక్తులతో సంక్రాంతికి పోటెత్తనుంది. ఈ అర్ధ కుంభమేళాను అత్యంత ఘనంగా నిర్వహించడానికి యోగి సర్కార్ యుద్ధప్రాతిపదికన మౌలిక సౌకర్యాలను ఏర్పాటు చేసింది. గతంలో ఎన్నడూ లేనంతగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు ఎదురు కాకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తుంది. ఫైవ్ స్టార్ రేంజ్ నుంచి సామాన్యుల వరకు అవసరమైన వసతి సౌకర్యాలను భక్తులకు అందిస్తుంది యోగి సర్కార్.

కుంభ మేళా సౌకర్యాలు ఇవే …
సుమారు 77 దేశాలనుంచి విదేశీయులు పాల్గొననున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాలనుంచి లక్షలమంది తరలి వెళ్లనున్నారు. దాంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేశారు. హరిద్వార్, ప్రయోగరాజ్, ఉజ్జయిని, నాశిక్ లలో కుంభమేళా మూడేళ్లకు ఒక్కోసారి నిర్వహిస్తారు. తాజాగా జరుగుతున్న కుంభమేళా అర్దకుంభమేళా. 12 ఏళ్లకు వచ్చే మేళా పూర్ణ కుంభమేళాగా, 144 ఏళ్లకు వచ్చే కుంభమేళాను మహాకుంభమేళాగా పిలుస్తారు.

టెంట్ సిటీ రెడీ …
ఇప్పుడు జరుగుతున్నా అర్దకుంభమేళాకు టెంట్ సిటీని రెడీ చేశారు. ఈ సిటీలో ఫైవ్ స్టార్ ను తలపించే ఇంద్రప్రస్థా లో ఒక రోజు బస చేయాలంటే 40వేలరూపాయలు చెల్లించాలి. మరో తరహా వసతికి రోజుకు 16 వేలరూపాయలు, 12 వేలరూపాయలు చెల్లించాలి. ఇక సామాన్యులకు 650 రూపాయలకు కూడా టెంట్ లు ఇందులో లభించడం విశేషం. అలాగే 40 వేల ఎల్ ఈ డి లైట్లు, లక్షా 25 వేల టాయిలెట్లు, 25 వేల చెత్తడబ్బాలు, 22వేల తాత్కాలిక వంతెనలు, 250 కిలోమీటర్ల మేర రోడ్లు ఏర్పాటు చేసింది యుపి సర్కార్.

ఈసారి ప్రత్యేకం బోటింగ్ …
ఇక పర్యాటకానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ కాశీ నుంచి త్రివేణి సంగమం వరకు 60 కిలోమీటర్ల దూరం బోట్ జర్నీ ఈసారి అర్దకుంభమేళా లో పర్యాటకులకు మధురానుభూతి. గంగా నది అందాలను తిలకిస్తూ సుమారు గంటలో గమ్యం చేరేలా స్పీడ్ బోట్ లు సిద్ధం అయ్యాయి. మేళాకు మకరసంక్రాంతి, మాఘపౌర్ణమి, వసంత పంచమి, మహాశివరాత్రి పర్వదినాలుగా భావించి అత్యధిక సంఖ్యలో భక్తులు పవిత్ర త్రివేణి సంగమంలో భక్తులు స్నానం చేసేందుకు లక్షలాదిగా తరలివెళతారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*