అంగరంగ వైభవం…తెలుగువారి సంబురం

అమెరికాలోని వివిధ రాష్ట్రాల్లో స్థిరపడ్డ తెలుగు ప్రజలను ఒక్కచోట చేర్చడమే లక్ష్యంగా నిర్వహిస్తున్న అమెరికా తెలుగు మహాసభలకు ఏర్పాట్లు అట్టహాసంగా జరుగుతున్నాయి. అమెరికన్ తెలుగు అసోసియేషన్(ఆటా), తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్(టాటా) ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ వేడుకలకు కౌంట్ డౌన్ మొదలైంది. మరో ఏడు రోజుల్లో మొదలుకానున్న ఈ వేడుకలకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు మొత్తం 300 మంది వాలంటీర్లు 40 కమిటీలుగా ఏర్పాడి ఏర్పాట్లు చేస్తున్నారు. కేవలం ఆరునెలల ముందే ఈ వేడుకలను నిర్వహించాలని నిర్ణయించి ఇంత భారీ ఏర్పాట్లు చేయడం మామూలు విషయం కాదు. డల్లాస్ లోని ఇర్వింగ్ కన్వెన్షన్ సెంటర్ లో మే 31వ తేదీ నుంచి జూన్ 2 వరకు ఈ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగనున్నాయి.

సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా…

వేడుకల్లో భాగంగా తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా పలు సంస్కృతిక కార్యక్రమాలు, డ్యాన్స్, మ్యూజిక్, సాహిత్య కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఈ వేడుకలకు పలువురు ప్రముఖ సినిమా నటులు, సింగర్లను కూడా ఆహ్వానించారు. తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న ప్రస్థుత పరిణామాలు, అభివృద్ధి పనుల గురించి అమెరికాలో స్థిరపడ్డ వారికి తెలియాల్సి ఉన్నందున రెండు రాష్ట్రాలకు చెందిన పలువురు రాజకీయ నాయకులను కూడా వేడుకలకు పిలిచారు. ఇక వేడుకల్లో చివరి రోజైన జూన్ 2న తెలుగువారి ఆరాధ్యదైవమైన శ్రీనివాస కళ్యాణం కార్యక్రమాన్ని ఘనంగా జరపనున్నారు. అమెరికాలోని అన్ని ప్రాంతాల్లో ఉన్న తెలుగువారిని ఈ వేడుకలకు ఆహ్వానిస్తున్నారు. ముఖ్యంగా యువతను పెద్దఎత్తున భాగస్వాములను చేయడానికి ప్రయత్నిస్తున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*