కన్నాపై చెప్పులు విసిరిన టీడీపీ కార్యకర్తలు

kanna lakshminarayana bharathiya janatha party

భారతీయ జనతా పార్టీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణపై నెల్లూరు జిల్లా కావలిలో దాడి జరిగింది. ఆయన పార్టీ కార్యక్రమంలో ఉండగా కొందరు వ్యక్తులు కన్నాపై చెప్పులు విసిరారు. అయితే, దాడి చేసిన వారిని గుర్తించి బీజేపీ నేతలు చితకబాదారు. కన్నాపై దాడి చేసిన వారు తెలుగుదేశం పార్టీ నేతలని వారు ఆరోపిస్తున్నారు. పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. దాడులు చేస్తున్న టీడీపీ రౌడియిజాన్ని అడ్డుకుంటామని హెచ్చరించారు. ఇంతకుముందు అమిత్ షా తిరుపతి పర్యటనకు వచ్చినప్పుడు కూడా టీడీపీ నేతలు అలిపిరి వద్ద అమిత్ షా కాన్వాయ్ పై దాడికి దిగారు. తాజాగా అనంతపురంలో కన్నా పర్యటనను కూడా టీడీపీ నాయకులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అయితే, కన్నాపై దాడి చేసింది టీడీపీ కార్యకర్తలు కాదని ఆ పార్టీ నేత బీద రవిచంద్ర చెబుతున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*