బ్రేకింగ్ : ఎంపీ అవంతికి అస్వస్థత..ఆస్పత్రికి తరలింపు

ganta srinivasaraovsavanthi srinivasarao

టీడీపీ అవంతి శ్రీనివాస్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. పార్లమెంటు సెంట్రల్ హాలులో ఆందోళన చేస్తున్న అవంతి శ్రీనివాస్ కు హైబీపీ, గుండెపోటు లక్షణాలు కనపడటంతో హుటాహుటిన వైద్యులు ఆసుపత్రికి తరలించారు. ఈరోజు సభ వాయిదా పడిన వెంటనే రాజ్యసభలో టీడీపీ ఎంపీలు ఆందోళన చేస్తూనే ఉన్నారు. తమ డిమాండ్లు నెరవేర్చాలని వారునినదిస్తూనే ఉన్నారు. రాజ్యసభ సభ్యులకు సంఘీభావంగా పార్లమెంటు సెంట్రల్ హాల్ లో టీడీపీ లోక్ సభ సభ్యులు కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో అవంతి శ్రీనివాస్ స్పృహతప్పి పడిపోయారు. వెంటనే అవంతిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. వైద్య సాయాన్ని అందిస్తున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*