ఆరు రోజుల పసికందును…?

ఎప్పడూ రద్దీగా వుండే కోఠి మెటర్నిటి ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. ఆరు రోజుల పసికందును గుర్తుతెలియని మహిళ ఎత్తుకుని పొయింది. ఆసుప్రతిలో మాటువేసి మరి ఈ పసికందుతో ఉడాయించిన తీరు ఇది. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఎల్లమ్మ తండాకు చెందిన విజయ డెలివరీ కోసం కోఠి మెటర్నిటి ఆసుపత్రికి వచ్చారు. ఆరు రొజుల క్రితం పండంటి ఆడ బిడ్డకు విజయ జన్మనిచ్చింది. తల్లి బిడ్డ కేమంగా వున్నారు. అయితే తల్లి కి కొద్దిగా నిరసంగా వుంది. బిడ్డ కొద్దిగా బరువు తక్కువగా వుండడంతో ఆసుప్రతిలో కొద్ది రొజుల పాటు వుండాలని వైద్యులు సూచించారు. అదే విధంగా తల్లి కూడా బాగా నీరసంగా వుందని, ఇద్దరూ ఆసుపత్రిలోనే వుండాలని చెప్పారు.

ఇంజక్షన్ ఇప్పిస్తానంటూ…..

అయితే నిన్న సాయంత్రం సయమంలో బిడ్డకు ఇంజక్షన్ ఇవ్వవలసి వుంది. తల్లి విజయ లేవ లేక పొతుంది. అదే సమయంలో అక్కడే మాటు వేసి వున్న ఒక గుర్తు తెలియని మహిళ విజయ వద్దకు వచ్చింది. ఈ మహిళ గత రెండు రోజుల నుంచి ఇక్కడే వుంటుంది. అందరితో మాటలు కలుపుతుంది. అందరిని పలుకరిస్తుంది. అయితే ఎవరికి కూడా అనూమానం రాలేదు. దీంతో బిడ్డ కు తాను ఇంజక్షన్ ఇప్పిస్తానని చెప్పి ఆరు రోజుల పసికందును తీసుకుని వెళ్లిపొయింది. అలా పొయిన మహిళ గంటకు కూడా తిరిగి రాకపొయే సరికి విజయ తన కుటుంబ సబ్యులకు సమాచారం ఇచ్చింది. దీంతో వారు కూడా ఆసుప్రతి మొత్తం వెతికారు. ఎక్కడా మహిళ జాడ దొరకలేదు.

బీదర్ వెళ్లిందా…?

దీంతో కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు నాలుగు బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చెపట్టిన్నారు. అయితే బిడ్డను ఎత్తుకుని పొయిన మహిళ నేరుగా ఇమిబ్లన్ బస్ స్టేషన్ కు వెళ్లింది. అక్కడ నుంచి బీదర్ కు వెళ్లుతున్న బస్ లో వెళ్లిపొయింది. అక్కడ వున్న సీసీ టివి కెమేరాల్లో ఈ దృశ్యాలు లభ్యమైన్నాయి. వెంటనే రెండు బృందాలు బీదర్ కు బయలు దేరాయి. ఏది ఏమైనా ఆసుప్రతిలో అపరిచితులను నమ్మవద్దని ఎంత చెప్పినా వినక పొవడంతోనే ఈ సమస్య వచ్చిందని పోలీసులు అంటున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*