బ్రేకింగ్ : బీజేపీకి బళ్లారి కూడా దక్కేలేదే…!!

dk sivakumar yadurappa karnataka

కర్ణాటక ఉపఎన్నికల్లో కాంగ్రెస్, జేడీఎస్ లు ఘన విజయం సాధించాయి. జమఖండి స్థానం కాంగ్రెస్ ఖాతాలో పడింది. జమఖండి శాసనసభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి ఆనంద న్యామ గౌడ విజయం సాధించారు. రామనగర అసెంబ్లీ స్థానం నుంచి ముఖ్యమంత్రి కుమారస్వామి అనిత విజయ దుందుభి మోగించారు. రెండు అసెంబ్లీ స్థానాలూ సంకీర్ణ సర్కార్ ఖాతాలోనే పడ్డాయి. మాండ్య పార్లమెంటు స్థానాన్ని జేడీఎస్ అభ్యర్థి శివరామగౌడ విజయం సాధించారు. బళ్లారి పార్లమెంటు నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి ఉగ్రప్ప విజయకేతనం ఎగుర వేశారు. శివమొగ్గలో మాత్రం యడ్యూరప్ప తనయుడు రాఘవేంద్ర ముందంజలో ఉన్నారు. మొత్తం మీద సిట్టింగ్ స్థానం బళ్లారిని కోల్పోవడం బీజేపీకి గట్టి దెబ్బే.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*