ఈసారైనా నాగ్ వస్తాడా..?

టాలీవుడ్ లో బిగ్ బాస్ ని గత ఏడాది ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా మొదలు పెట్టిన స్టార్ మా ఈ ఏడాది ఎన్టీఆర్ ప్లేస్ లోకి నేచురల్ స్టార్ నాని ని తీసుకొచ్చారు. నాని బిగ్ బాస్ సీజన్ 2 ని బాగానే హ్యాండిల్ చేస్తున్నాడు. కాకపోతే బిగ్ బాస్ టు కంటెస్టెంట్ కౌశల్ కి ఒక బయట సోషల్ మీడియాలో ఒక ఆర్మీ ఏర్పడడం.. కౌశల్ ఆర్మీ అంటూ వారు కౌశల్ కి వత్తాసు పలుకుతూ వారు చేస్తున్న పనులు చూస్తుంటే ఒక పక్క నానికి, మరోపక్క స్టార్ మా యాజమయానికి అంతుపట్టని తలనొప్పి స్టార్ట్ అయ్యింది. ప్రస్తుతం చివరి దశలో ఉన్న బిగ్ బాస్ సీజన్ టు మరో రెండు వారాల్లోనే కంప్లీట్ కాబోతుంది. అయితే సీజన్ వన్ ని ఎన్టీఆర్ సింగిల్ హ్యాండ్ తో ఎంత బాగా హ్యాండిల్ చేసాడో.. అలా నాని ఈ సీజన్ టు అయితే హ్యాండిల్ చెయ్యలేకపోతున్నాడనేది వాస్తవం.

సీజన్ 1లో……..

ఇక సీజన్ వన్ గ్రాండ్ ఫైనల్ కి కింగ్ నాగార్జున గెస్ట్ గా వస్తాడని ప్రచారం జోరుగా జరిగినప్పటికీ… సీజన్ వన్ గ్రాండ్ ఫినాలేని యంగ్ టైగర్ ఎన్టీఆర్ తనదైన శైలిలో రక్తి కట్టించాడు. అప్పట్లో అతిధులుగా అనేక రకాల హీరోల పేర్లు వినబడ్డప్పటికీ.. చివరికి గ్రాండ్ ఫినాలేని ఎన్టీఆర్ మాత్రమే చేసి ఔరా అనిపించాడు. ఇక తాగాజా బిగ్ బాస్ సీజన్ టు గ్రాండ్ ఫైనల్స్లో కింగ్ నాగార్జున రాబోతున్నాడంటూ గత రెండు మూడు రోజులుగా పెద్ద ఎత్తున వార్తలొస్తున్నాయి. ముందుగా ఎన్టీఆర్ ని స్టార్ మా యాజమాన్యం సీజన్ టు గ్రాండ్ ఫైనల్ గెస్ట్ గా రమ్మని అడగగా.. ఎన్టీఆర్ పర్సనల్ కారణాలు, సినిమా షూటింగ్ తో బిజీగా ఉండడంతో… ఎన్టీఆర్ రాలేనని చెప్పడంతో.. స్టార్ మా చివరికి నాగార్జున దగ్గరకెళ్లారనేది లేటెస్ట్ న్యూస్.

నాగార్జున వస్తున్నారంటూ…..

నాగార్జున ఎలాగూ స్టార్ మాకి బాగా కావాల్సిన వాడు. అలాగే నానితో కలిసి నాగార్జున దేవదాస్ సినిమాలో నటించాడు. మరా దేవదాస్ సినిమా కూడా ఈనెలాఖరునే విడుదల కాబోతుంది. ఎలాగూ బిగ్ బాస్ సీజన్ టు గ్రాండ్ ఫైనలేకి హాజరై.. నాగార్జున నాని కలిసి కట్టుగా దేవదాస్ ని ప్రమోట్ చేసుకుంటారని… ఇవన్నీ ఆలోచించే నాగార్జున బిగ్ బాస్ గ్రాండ్ ఫైనల్ కి రాబోతున్నాడంటూ వార్తలొస్తున్నాయి. ఇక ఇప్పటికే నాగార్జున స్టార్ మా లో మీలో ఎవరు కోటీశ్వరుడు ద్వారా దగ్గరవడం.. అందుకే స్టార్ మా యాజమాన్యం అడగగానే నాగార్జున బిగ్ బాస్ సీజన్ టు ఫినాలేకి రావడానికి ఒప్పుకున్నాడని టాక్ నడుస్తుంది. మరి సీజన్ వన్ లాగ నాగార్జున వస్తున్నాడంటూ చెప్పి.. చివరికి నాని చేతే బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలేని మమా అనిపించదు కదా స్టార్ మా యాజయాన్యం. ఏమో బిగ్ బాస్ నాని చెప్పినట్టు ఏదైనా జరగొచ్చు.