వైసీపీ గూటికి బీజేపీ నేతలు

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరికలు కొనసాగుతున్నాయి. మంగళవారం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చొక్కాకుల వెంకట్రావు, బోకం శ్రీనివాస్ ఆద్వర్యంలో పలువురు సర్పంచ్ లు, నాయకులు తూర్పు గోదావరి జిల్లా రాయవరంలో వైఎస్ జగన్ సమక్షంగా వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… జగన్ లో ఉన్న ఆత్మవిశ్వాసమే తమను వైసీపీలో చేరేలా చేసిందని పేర్కొన్నారు. పాలనలో చంద్రబాబు పూర్తిగా విపలమయ్యారని, ప్రజలకు ఎలాంటి సంక్షేమ పథకాలు అందడం లేదని ఆరోపించారు. అయితే, రాష్ట్రంలో వైసీపీ, బీజేపీ కుమ్మక్కయిందని తెలుగుదేశం ఒకవైపు ప్రచారం చేస్తుండగా, అందుకు విరుద్ధంగా బీజేపీ నాయకులు ఆ పార్టీని వదిలి వైసీపీలో చేరడం గమనార్హం.