టీడీపీ ఫ్లైట్ లో బీజేపీ ఎంపీ… ట్వీట్ చేసిన విజయసాయిరెడ్డి

vijayasaireddy ysrcnogressparty

పబ్లిగ్గా దుమ్మెత్తి పోసుకుంటున్న టీడీపీ, బీజేపీలు ప్రైవేటుగా ప్రేమాయణం సాగిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు. ఢిల్లీలో చంద్రబాబు నాయుడు చేస్తున్న ధర్మ పోరాట దీక్షకు తెలుగుదేశం పార్టీ నేతలు స్పెషల్ ఫ్లైట్లో వెళ్లారు. అయితే, ఈ ఫ్లైట్లో బీజేపీ విశాఖపట్నం ఎంపీ హరిబాబు ఉన్నారు. ఈ ఫోటోను ట్వీట్ చేసిన విజయసాయిరెడ్డి… బీజేపీతో కటీఫ్ అంటూనే బాబు ఆండ్ కో చాటుగా వారితో సాగిస్తున్న కాపురం గుట్టురట్టయ్యిందని పేర్కొన్నారు. టీడీపీ స్పెషల్ ఫ్లైట్ లో బీజేపీ ఎంపీ ప్రత్యక్షం కావడం వారి అనైతిక సంబంధానికి నిదర్శనం కాదా అని ప్రశ్నంచారు.

 

 

Sandeep
About Sandeep 6914 Articles
Sandeep Reddy started his work in journalism at the age of 19 as a local reporter in leading telugu news paper. Later he worked as staff reporter. He has 9 years of experience in print and social media.

1 Comment on టీడీపీ ఫ్లైట్ లో బీజేపీ ఎంపీ… ట్వీట్ చేసిన విజయసాయిరెడ్డి

  1. ఏమో ఆయన పార్టి మారుతున్నాదేమో ఎవరికీ తెలుసు? నిన్నటి మోడీ గారు గుంటూరు ప్రసంగం తర్వాత రాష్ట్రం లో బిజెపి నామరూపాలు లేకుండా పోయింది. ప్రజలు చికోట్టుకున్తున్నారు. మన పుట్టగతుల గురించి ఎవడికి వాడు చూసుకుంటాడు.

Leave a Reply

Your email address will not be published.


*