ఇక యుద్ధమే..

ఆంధ్రప్రదేశ్ లో డ్యామేజ్ అయిన ఇమేజ్ ను తిరగి సంపాదించేందుకు, పార్టీని బలోపేతం చేసేందుకు భారతీయ జనతా పార్టీ నాయకలు నడుంబిగించినట్లే కనపతోంది. ఈ మేరకు శనివారం గుంటూరులో ఎన్డీఏ నాలుగేళ్ల విజయోత్సవ సభ ఘనంగా జరిగింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కన్నా లక్ష్మీనారాయణ నియమితులైన తర్వాత నిర్వహించిన మోదటి సభ ఇది. ఈ సందర్భంగా కన్నా లక్ష్మీనారాయణ బాధ్యతలు స్వీకరించారు. ఈ సభా వేదికపై నుంచే తమ పాత మిత్రుడు చంద్రబాబు నాయుడుపై ఆ పార్టీ యుద్ధం ప్రకటించినట్లే కనపడుతోంది. రాష్ట్రంలో టీడీపీ, వైసీపీ పార్టీలకు దీటుగా బీజీపీని తయారుచేస్తామని ప్రకటించారు.

కుటుంబ, కుల రాజకీయాలకు స్వస్తి పలకాలి..

గుంటూరు సభకు ముఖ్యఅతిథిగా ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…కన్నా మచ్చలేని రాజకీయ నాయకుడు, చంద్రబాబు కంటే కూడా అనుభవం ఉన్న నాయకుడన్నారు. బీజేపీపై చంద్రబాబు నాయుడు అసత్యప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఈ ప్రచారాన్ని తిప్పికొట్టాలన్నారు. మోడీని అవినీతిపరుడిని చేసే శక్తి ఎవరికీ లేదన్నారు. కేంద్రంలో అస్థిర ప్రభుత్వం ఉండాలని చంద్రబాబు భావిస్తున్నారన్నారు. చంద్రబాబు-కాంగ్రెస్ కలవడంతో ఎన్టీఆర్ ఆత్మక్షోభిస్తుందన్నారు. రాష్ట్రంలో కుటుంబ, కుల రాజకీయాలు నడుస్తున్నాయని, చివరకు దేవుడికి కూడా కులం అంటగడుతున్నారనన్నారు. ఈ తరహా రాజకీయాలకు అంతం పలకాలన్నారు. ఏపీలో కొత్త తరహా రాజకీయ వ్యవస్థను తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో మోదీకి దీటైన నాయకుడు లేడని, ఫ్రంట్లలో నలుగురైదుగురు ప్రధానమంత్రి అభ్యర్థులు తయారయ్యారని పేర్కొన్నారు. 2019లో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వస్తోందని, ఇందుకోసం మోదీ, అమిత్ షాతో పాటు రాహుల్ గాంధీ కూడా కష్టపడుతున్నారని ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్ కి ఇచ్చిన అనేక విభజన హామీలు నెరవేర్చామని, మిగతావి కూడా కచ్చితంగా తీరుస్తామన్నారు.

మట్టికొట్టిన వ్యక్తిని కౌగలించుకుంటావా..?

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ…చంద్రబాబు నాయుడు బీజేపీపై టీడీపీ అద్దె మైకులతో తప్పుడు ప్రచారం చేయిస్తున్నాడని విమర్శించారు. చంద్రబాబుకు అధికారం అవసరమైనప్పుడల్లా బీజేపీతో పొత్తు పెట్టుకుంటాడన్నారు. చంద్రబాబు నిర్వాకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తామని స్పష్టం చేశారు. ఆల్మట్టి డ్యామ్ తో ఏపీ నోట్లో మట్టికొట్టిన దేవేగౌడను చంద్రబాబు కౌగిలించుకుంటున్నాడని విమర్శించారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*