బ్రేకింగ్ : మొత్తం 32 మంది మృతి

కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకుని వస్తూ మొత్తం 32 మంది మృత్యువు పాలయ్యారు. జగిత్యాల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు కొండగట్టు ఆంజనేయ స్వామి గుడి నుంచి జగిత్యాలకు బయలుదేరింది. అయితే ఘాట్ రోడ్డులో బస్సు డ్రైవర్ వేగాన్ని అదుపుచేయలేకపోవడంతో లోయలో పడింది. బస్సులో మొత్తం 62 మంది ప్రయాణికులుండగా అందులో 32 మంది చనిపోయారు. మృతుల్లో మహిళలు, చిన్నారులు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. డ్రైవర్ నిర్లక్ష్యమేకారణమని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ప్రమాదం జరిగిన బస్సుకు ఫిట్ నెస్ ఉందని జగిత్యాల డిపోమేనేజర్ చెబుతున్నారు. మృతుల సంఖ్య మరింత పెరగకుండా క్షతగాత్రులకు వైద్య సహాయాన్ని అందించేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి మృతదేహాలను తరలించారు. బంధువుల రోదనలతో ఆసుపత్రి ప్రాంగణం మిన్నంటుతోంది. మంగళవారం కావడంతో కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు కొండగట్టుకు వచ్చారు.మృతులు ఎక్కువ మంది శనివారం పేట గ్రామానికి చెందిన వారు ఉన్నట్లు తెలుస్తోంది.