బ్రేకింగ్ : ఘోరప్రమాదం…పది మంది మృతి

జగత్యాల జిల్లాలో ఘోరప్రమాదం జరిగింది. కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకుని వస్తూ మృత్యువు పాలయ్యారు. కొండగట్టు నుంచి జగిత్యాల వైపు వెళుతున్నఆర్టీసీ బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో పది మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో దాదాపు 60 మంది వరకూ ఉన్నారని తెలుస్తోంది. ఈరోజు మంగళవారం కావడంతో కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకుని తిరిగి వస్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఇప్పటి వరకూ పది మృతదేహాలను బస్సు నుంచి వెలికి తీశారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. పదుల సంఖ్యలో క్షతగాత్రులయ్యారు.