ఏపీ నిర్ణయంపై సీబీఐ సమాలోచనలు

cbi eneters andhra pradesh

ఆంధ్రప్రదేశ్ లో సీబీఐ ప్రవేశానికి అనుమతి తప్పనిసరి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సీబీఐ సమాలోచనలు చేస్తోంది. ఈ అంశంలో అనుసరించాల్సిన వైఖరిపై సీబీఐ అధికారులు న్యాయనిపుణుల సలహా తీసుకుంటున్నారు. ఏపీలోకి సీబీఐ రావాలంటే రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తప్పనిసరి చేస్తూ ఈ నెల 8వ తేదీన జీఓ నెంబర్ 176 జారీ చేసింది. అయితే, ఈ జీఓను రహస్యంగా ఉంచడంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాగా, సీబీఐ ప్రతిష్ఠ మసకబారినందునే ఈ నిర్ణయం తీసుకున్నామని ఏపీ ప్రభుత్వం అంటోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*