భౌతికకాయాన్ని మోసిన చంద్రబాబు, చలమేశ్వర్

నందమూరి హరికృష్ణ అంతిమయాత్ర ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, సుప్రీం కోర్టు పూర్వపు న్యాయమూర్తి జాస్తి చలమేశ్వర్ స్వయంగా హరికృష్ణ భౌతిక కాయాన్ని మోశారు. ప్రత్యేకంగా అలంకరించిన వాహనంతో అంతిమయాత్ర సాగిస్తున్నారు. మెహదీపట్నంలోని ఆయన నివాసం నుంచి జూబ్లీహిల్స్ మహా ప్రస్థానం వరకు అంతిమయాత్ర కొనసాగనుంది. వేలాదిగా అభిమానులు, టీడీపీ నాయకులు, సినీ పరిశ్రమ వర్గాలు అంతిమ యాత్రకు హాజరయ్యారు. హరికృష్ణ పెద్దకుమారుడు జానకిరామ్ మరణించడంతో రెండో కుమారుడు కళ్యాణ్ రామ్ హరికృష్ణ దహన సంస్కారాలు పూర్తి చేయనున్నారు.