వైసీపీ, జనసేనపై మండిపడ్డ చంద్రబాబు

అఖిలపక్ష సమావేశానికి రాకుండా కొన్ని పార్టీలు పరోక్షంగా ప్రధాని మోడీకి సహకరిస్తున్నారని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించారు. ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడుతున్న తనతో కలసి రావడానికి కొన్ని పార్టీలు ఇష్టపడటం లేదని, వారి వ్యక్తి గత స్వార్థం కోసమే వేరే దారులు చూసుకుంటున్నారని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. అలాగే రాజధాని నిర్మాణాన్ని కూడా ఎగతాళి చేస్తున్నారన్నారు. రాజధానిపై తన వద్ద పనిచేసిన ఒక వ్యక్తి పుస్తకం రాసి ఆంధ్రప్రదేశ్ ను కించపర్చేలా వ్యవహరిస్తున్నారన్నారు. కొందరు రాజధానికి రెండు వేల ఎకరాలు చాలంటున్నారని, ప్రజల సహకారంతోనే ప్రజా రాజధానిని నిర్మిస్తామని చెప్పారు. మంచి రాజధానిని నిర్మిస్తాననే తనకు ప్రజలు పట్టం కట్టిన విషయాన్ని చంద్రబాబు గుర్తు చేశారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*