బ్రేకింగ్ : పొత్తులపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

chandrababu naidu election stunts

తెలంగాణలో పొత్తులపై ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు జాగ్రత్తగా సైడ్ అయిపోయారు. ఇక్కడ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటే ఆంధ్రప్రదేశ్ లో ఇబ్బంది అవుతుందని గ్రహించిన చంద్రబాబు పొత్తులపై నిర్ణయాన్ని తెలంగాణ టీడీపీ నేతలకు వదిలేశారు. కాంగ్రెస్ తో పొత్తు ఇంచుమించు ఫైనల్ అయినా కూడా ఆ విషయాన్ని తెలంగాణ టీడీపీ నేతలతోనే చేప్పించాలని భావిస్తున్నారు. తెలంగాణ ప్రయోజనాలు, తెలంగాణ టీడీపీ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని పొత్తులపై ఇక్కడి నాయకత్వమే నిర్ణయం తీసుకోవాలని, ఆ నిర్ణయాన్ని తాను సమ్మతిస్తానని ప్రకటించారు. శనివారం హైదరాబాద్ లో జరిగిన పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ… రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి బాటలో నడవాలనే తాను ఆకాంక్షించానని పేర్కొన్నారు. ఎప్పుడు ప్రధాని వద్దకు వెళ్లినా రెండు రాష్ట్రాల సమస్యలను ప్రస్తావించేవాడిని అని పేర్కొన్నారు. కేసీఆర్ తో తాను సఖ్యతగా ఉండాలని ప్రయత్నించానని, కానీ, మోదీ మాత్రం ఇద్దరి మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేశారని ఆరోపించారు. దేశవ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాలన్నీ ఏకమవుతున్నాయన్నారు.

Sandeep
About Sandeep 4897 Articles
Sandeep Reddy started his work in journalism at the age of 19 as a local reporter in leading telugu news paper. Later he worked as staff reporter. He has 9 years of experience in print and social media.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*