ఇక కేసీఆర్ ఫామ్ హౌజ్ కే పరిమితం

chandrababu comments on bjp

డిసెంబర్ 12 నుంచి కేసీఆర్ ఫామ్ హౌజ్ కి పరిమితం కావాల్సిందేనని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు జోస్యం చెప్పారు. బుధవారం రాహుల్ గాంధీతో కలిసి ఆయన కోదాడలో కాంగ్రెస్ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ… నియంతలా పాలించిన కేసీఆర్ ఇవే చివరి ఎన్నికలు కావాలని, టీఆర్ఎస్ పార్టీని ఇంటికి పంపించాలని పేర్కొన్నారు. 11న ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి అవుతారన్నారు. కేసీఆర్ లో ఓటమి భయంతో అసహనం పెరిగిందని, ఇదే ప్రజాకూటమి విజయానికి సంకేతమన్నారు. పగలు ఎంఐఎంతో రాత్రి బీజేపీతో స్నేహం కేసీఆర్ స్నేహం చేస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్ ను తాను, కాంగ్రెస్ అభివృద్ధి చేస్తే కేసీఆర్ ఏం చేయలేదన్నారు. రాష్ట్రంతో గాడి తప్పిన పరిపాలనను తిరిగి గాడిలో పెట్టే సత్తా ప్రజాకూటమికే ఉందన్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*