బాబుపై కేసు పెట్టాల్సిందే….!!!

chandrababu highcourt ysrcongress party

హైకోర్టు విభజన విషయంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎందుకు బాధపడుతున్నారని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. జగన్ కోసమే విభజన చేశారని బాబు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. డిసెంబరు 31వ తేదీ నాటికి హైకోర్టును విభజించాలని చంద్రబాబు సుప్రీంకోర్టులో అఫడవిట్ సమర్పంచలేదా? అని ప్రశ్నించారు. దాని ప్రకారమే హైకోర్టు విభజన జరిగితే దానికి జగన్ కేసులకు లింకు ఎందుకు పెడతారని నిలదీశారు. చంద్రబాబు మనసులోనే కుట్ర దాగి ఉందని వైసీపీ నేత సి. రామచంద్రయ్యా అన్నారు. రాత్రికి రాత్రి సచివాలయాన్ని హైదరాబాద్ నుంచి అమరావతికి తీసుకెళ్లింది ఎవరని సి.రామచంద్రయ్య ప్రశ్నించారు. సుప్రీంకోర్టు తీర్పును, రాష్ట్రపతి ఉత్తర్వులను కూడా చంద్రబాబు పక్కదారి పట్టించే విధంగా మాట్లాడుతున్నారన్నారు. న్యాయవ్యవస్థను అపహాస్యం చేస్తున్న చంద్రబాబుపై సుమోటోగా కేసు పెట్టాలని సీఆర్ డిమాండ్ చేశారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*