జగన్ కేసుపై ప్రధాని మోదీకి చంద్రబాబు ఘాటు లేఖ

chandrababu letter to modi

ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పై హత్యాయత్నం కేసును ఎన్ఐఏకి అప్పగించడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. ఈ మేరకు ఆయన తన అసంతృప్తిని తెలియజేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఐదు పేజీల లేఖను రాశారు. సంక్లిష్టమైన జాతీయ, అంతర్జాతీయ స్థాయి కేసులు, దేశ భద్రత, ఆయుధాలు, డ్రగ్స్ కేసులు మాత్రమే ఎన్ఐఏ దర్యాప్తు చేయాలని, కానీ కేంద్రం ఎన్ఐఏ చట్టాన్ని దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు. కేంద్రం తీరు ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు. చిన్న కేసును పెద్దది చేసి చూపించడం, ఇతర రాజకీయ కుట్ర ఏదైనా ఉందేమోనని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఎన్ఐఏ విచారణపై ఏపీ ప్రభుత్వానికి అభ్యంతరాలు ఉన్నాయని, ఎన్ఐఏ విచారణను నిలిపివేయాలని ఆయన కోరారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*