అఖిలప్రియపై అధిష్టానం సీరియస్…? అమరావతికి పిలుపు

akhilapriya telugudesamparty

అఖిలప్రియపై టీడీపీ అధిష్టానం సీరియస్ అయింది. నిన్న ఆళ్లగడ్డ నియోజకవర్గంలో టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డిపై అఖిలప్రియ వర్గీయులు రాళ్లదాడిచేసిన సంగతి తెలిసిందే. దీనిపై ఏవీ సుబ్బారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆళ్లగడ్డ బంద్ కు కూడా పిలుపునిచ్చిన ఏవీ సుబ్బారెడ్డి చివరకు దానిని విరమించుకున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు నుంచి అఖిలప్రియకు, ఏవీ సుబ్బారెడ్డికి పిలుపు వచ్చింది. రేపు వీరిద్దరితో చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. పార్టీ కార్యక్రమాలను చేపడుతున్నప్పుడు ఇలా రాళ్లదాడికి దిగితే ఎలా అని టీడీపీ అగ్రనాయకత్వం కూడా అభిప్రాయపడుతోంది. దీంతో రేపు చంద్రబాబు సమక్షంలో జరగబోయే సమావేశంలో అఖిలప్రియకు, ఏవీ సుబ్బారెడ్డిలకు చంద్రబాబు సీరియస్ వార్నింగ్ ఇచ్చే అవకాశముందంటున్నారు టీడీపీ నేతలు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*