
ఢిల్లీ వేదికగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేస్తున్న ధర్మపోరాట దీక్షకు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సంఘీభావం తెలిపారు. ఏపీ దేశంలో భాగం కాదా? అని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. తాను ఆంధ్రప్రదేశ్ ప్రజల పక్షాన నిలబడతానని రాహుల్ వేదికగా హామీ ఇచ్చారు. నరేంద్ర మోదీ ఏపీకి అన్యాయం చేశారన్నారు. ప్రధాని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలా? వద్దా? అని రాహుల్ ప్రశ్నించారు. నరేంద్ర మోదీ ఎక్కడకు వెళ్లినా అబద్ధాలు చెబుతారన్నారు. ఏపీకి వెళ్లి మోదీ అబద్ధాలు చెప్పి వచ్చారన్నారు. చంద్రబాబు దీక్షకు ఫరూక్ అబ్దుల్లా మద్దతు ప్రకటించారు. చంద్రబాబు దీక్షకు ఆమ్ ఆద్మీ పార్టీ మద్దతు ప్రకటించింది.
Leave a Reply