మరోసారి బాబుకు ఝలక్

chandrababu changed strategy over modi

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రధాని నరేంద్ర మోదీపై ఎంత దూకుడు పెంచుతుంటే కేంద్రం అంత కసి తీర్చుకునేలా ఏపీ పట్ల వ్యవహరిస్తోంది. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దావోస్ పర్యటనను కుదించిన కేంద్ర ప్రభుత్వం తాజాగా రిపబ్లిక్ పరేడ్ వేడుకల్లో ఏపీ శకటాన్ని తిరస్కరించడం చర్చనీయాంశమైంది. తొలుత ఏపీ శకటాన్ని అనుమతించింది. మహాత్మాగాంధీ జీవిత ఇతివృత్తాంతం తో కూడిన శకటం తయారు చేయాలని కేంద్రం రాష్ట్రానికి సూచించింది. అయితే చివరి నిమిషంలో ఏపీ శకటాన్ని తిరస్కరిస్తున్నట్లు కేంద్రం కబురుపంపింది. ఇటీవల విశాఖ ఉత్సవ్ వేడుకల్లోనే ఎయిర్ షోకు అనుమతిచ్చినట్లే ఇచ్చి కేంద్ర వెనక్కు తీసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై కేంద్రానికి లేఖ రాయాలని నిర్ణయించారు. ఏపీ పట్ల కేంద్రం వివక్షతచూపుతోందని, రాష్ట్రాలపై మోదీ పెత్తనం ఎక్కువయిందని చంద్రబాబు ఆరోపించారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*