ఆశావ‌హుల బుజ్జ‌గింపులు షురూ

కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థుల ఎంపిక ప్ర‌క్రియ చివ‌రి ఘ‌ట్టానికి చేరింది. నిన్న‌, ఇవాళ ఢిల్లీలోని కాంగ్రెస్ వార్ రూంలో అభ్య‌ర్థుల ఎంపిక‌కు భారీ క‌స‌ర‌త్తు జ‌రుగుతోంది. రేప‌టి లోగా అభ్య‌ర్థుల ఎంపిక ప్ర‌క్రియ పూర్తి చేయాల‌ని భావిస్తోంది. ఇక ఆశావ‌హులు ఎక్కువ ఉన్న స్థానాల్లో టిక్కెట్లు ఎవ‌రికి ఇవ్వాలో ఓ నిర్ణ‌యానికి వ‌చ్చారు. దీంతో అస‌మ్మ‌తులు రేగ‌కుండా బుజ్జ‌గింపు ప్ర‌య‌త్నాలు ప్రారంభించారు. ఆశావ‌హులు ప్ర‌స్తుతం ఢిల్లీలోనే మ‌కాం వేయ‌డంతో రాష్ట్ర కాంగ్రెస్ వారిని నియోజ‌క‌వ‌ర్గాల వారీగా పిలిచి టిక్కెట్లు ద‌క్క‌కున్నా మ‌న పార్టీ అధికారంలోకి రాబోతోంద‌ని, అధికారంలోకి రాగానే ఎమ్మెల్సీ లేదా నామినేటెడ్ ప‌ద‌వుల ద్వారా న్యాయం చేస్తామ‌ని హామీ ఇస్తున్నారు.

 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*