కాంగ్రెస్ నాయకురాలి చీటింగ్

ఆంధ్రప్రదేశ్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీపై కృష్ణా జిల్లా ఉంగుటూరు పోలీస్ స్టేషన్ లో చీటింగ్ కేసు నమోదైంది. స్థానికంగా ఓ డెయిరీ ఫామ్ లో పనిచేసే మహిళ కుమారుడు ప్రమాదవశాత్తూ డెయిరీ ఫామ్ ఆవరణలో పడి మరణించాడు. దీంతో పద్మశ్రీ మధ్యవర్తిత్వంతో సదరు డెయిరీ ఫామ్ నిర్వహాకుడు కుమారుడిని కోల్పోయిన మహిళకు లక్ష రూపాయలు ఇచ్చేందుకు అంగీకరించారు. అయితే, డెయిరీ ఫామ్ నిర్వాహకుడు లక్ష రూపాయలు పద్మశ్రీకి ఇచ్చినా అవి బాధిత కుటుంబానికి ఇవ్వలేదని కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పద్మశ్రీపై చీటింగ్ కేసు నమోదైంది. అయితే, తనపై ఎమ్మెల్యే వల్లభనేని వంశీ చేస్తున్న రాజకీయ కుట్రలో భాగంగానే ఈ కేసు నమోదు చేయించారని పద్మశ్రీ ఆరోపిస్తున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*