బాబు ఇలాకాలో కర్ణాటక ఎమ్మెల్యేలు

కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటు అంశం రసవత్తరంగా మారింది. అధికారం చేపట్టేందుకు ఎవరికీ సరిపడా మెజారిటీ లేకపోవడంతో క్యాంపు రాజకీయాలు మొదలయ్యాయి. జేడీఎస్, కాంగ్రెస్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే ప్రయత్నం చేస్తున్నాయి. మరోవైపు జేడీఎస్ లో చీలిక తీసుకువచ్చి అధికారాన్ని కైవసం చేసుకునేందుకు బీజేపీ ఇప్పటికే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇప్పటికే ఆ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి యడ్యూరప్ప గవర్నర్ ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని, బలనిరూపణ కోసం వారం రోజులు సమయం ఇవ్వాలని కోరారు. ఈ నేపథ్యంలో తమ ఎమ్మెల్యేలను కాపాడకునేందుకు కాంగ్రెస్, జేడీఎస్ లు క్యాంపు రాజకీయాలకు తెరలేపాయి. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు చేజారకుండా పంజాబ్, ఆంధ్రప్రదేశ్ లలో క్యాంపులకు తరలిస్తున్నారు.