మళ్లీ డేటా చోరీ కేసు…..!!!

data theft case in telangana

ఐటి గ్రిడ్ పైన మరో కేసు నమోదైంది . ఆధార్ డాటా చోరీ చేసినందుకు కేంద్ర ప్రభుత్వమే ఐటి గ్రిడ్ పైన ఫిర్యాదు చేసింది . ఏకంగా 7 కోట్ల 90 లక్షల ఆధార్ డాటాని ఐటి గ్రిడ్ వద్ద అధికారులు కనుక్కోవడం జరిగింది . తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన ఓటర్ ఐడీ కార్డు లతోపాటు ఆధార్ నెంబర్లను అక్రమంగా సేకరించిన ఆరోపణలపై పోలీసులు కేసు నమోదు చేశారు . సంచలనం సృష్టించిన ఈ గ్రిడ్ పైన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఇటు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది . ఐపీఎస్ అధికారి స్టీఫెన్ రవీంద్ర నేతృత్వంలో సిట్ ఏర్పాటయింది. ఎన్నికల ముందు సంచలనం సృష్టించిన ఈ డాటా చోరీ కేసును సిట్ సీరియస్ గా విచారణ చేస్తూనే ఉంది . ఇందులో కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

ఆంధ్రప్రదేశ్ లోనూ….

ఐటి గ్రిడ్ సంస్థ ఇటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన ఓటర్ ఐడి కార్డ్ లతో పాటుగా ఆధార్ సంబంధించిన వివరాలను కూడా సేకరించి పెట్టుకుంది . ఐటి గ్రిడ్ సంస్థ తెలుగుదేశం పార్టీ కోసం పని చేస్తున్నట్లుగా అధికారులు గుర్తించారు. తెలుగుదేశం పార్టీ అక్రమంగా డాటాను సేకరించి దాని ద్వారాఓటర్లను ప్రభావితం చేసేందుకు కుట్ర చేసిందని ప్రధాన ఆరోపణలు ఉన్నాయి . ఈ నేపథ్యంలోనే సిట్ విచారణ మొదలైంది . మరోవైపు అటు ఆంధ్రా లో కూడా తమ డాటాను తెలంగాణ ప్రభుత్వం తో పాటుగా వైఎస్ఆర్సీపీ చోరీ చేసిందని ఏపీ సర్కార్ ఆరోపిస్తోంది. ప్రభుత్వం ప్రత్యేకంగా రెండు సిట్ లను ఏర్పాటు చేసింది . అక్కడ కూడా రెండు సిట్ లు దర్యాప్తు చేస్తున్నాయి. . ఇందులో ప్రధానంగా డాటా ఎక్కడినుంచి సేకరించారు..? ఎవరు దీని లబ్ధిదారులు అనే విషయాన్ని సిట్ ఇప్పటికే కనుక్కోవడం జరిగింది .

ఆధార్ సంస్థ రంగంలోకి….

మరోవైపు ఆధార్ కు సంబంధించిన ఏడు కోట్ల 90 లక్షల వివరాలను కూడా డాటా సైట్ లో లభ్యమవ్వడంతో, దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ సంస్థ సిట్ అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది . కేంద్ర ఆధార్ సంస్థ నేరుగా మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ కేసులో మరొక ట్విస్ట్ వెలుగులోకి వచ్చిందని చెప్పవచ్చు . ఇప్పటివరకు అండర్ గ్రౌండ్ లో ఉన్న దాకావరపు అశోక్ కోసం పోలీసులు గాలిస్తున్నారు . మరోవైపు ఈ కేసులో నుంచి తనను పేరు తొలగించాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు . దానిపైన ఇంకా హైకోర్టులో విచారణ కొనసాగుతూనే ఉంది . మరోవైపు అశోక్ విచారణకు పూర్తిగా సహకరించడం లేదని చెప్పి సిట్ పెటిషన్ కూడా దాఖలు చేసింది.

Ravi Batchali
About Ravi Batchali 17221 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*