పోలీసులు గాలిస్తున్నా… సంజయ్….?

సీనియర్ నేత డి.శ్రీనివాస్ తనయుడు ధర్మపురి సంజయ్ కు హైకోర్ట్ లో చుక్కెదురైంది…లైంగిక వేదింపుల ఆరోపణల కేసులో సంజయ్ హైకోర్ట్ లో క్వాష్ పిటిషన్ వేశారు…అయితే సంజయ్ దాఖాలు చేసిన పిటిషన్ ను విచారించిన కోర్టు కొట్టేసింది…ఇటివలే నిజామాబాద్ శాంకరి నర్సింగ్ కాలేజి లు విద్యార్థినులు సంజయ్ తమను లైంగికంగా వేదిస్తున్నాడని హొమంత్రి నాయిని నర్సింహరెడ్డిని కలిసి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే…విద్యార్థినుల ఫిర్యాదును సిరియస్ గా తీసుకున్న హొమంత్రి వెంటనే దినిపై పూర్తి విచారణ చేయాలని డిజిపి మహేందర్ రెడ్డికి ఆదేశాలు జారి చేశారు.

హైకోర్టు కొట్టేయడంతో…..

డిజిపి మహేందర్ రెడ్డికి ఫిర్యాదు చేసిన విద్యార్థినులను నిజామాబాద్ నగర్ కమిషనర్ కార్తికేయను కలవాలని సూచించారు. దీంతో విద్యార్థినులు నగర్ కమిషర్ ను కలిసి సంజయ్ చేసిన వెకిలి చేష్టల గురించి చెప్పుకొచ్చారు…అయితే విచారణ నిమిత్తం విద్యార్థినులను కమిషనర్ కార్యలయం నుంచి ఫోర్త్ టౌన్ పిఏస్ కు తీసుకువెళ్లి వారి నుంచి వివరాలు తెలుసుకున్నారు…ఒక్కో విద్యార్థిని నుంచి విడి విడిగా స్టేట్ మెంట్ రికార్డ్ చేసిన తర్వాత సంజయ్ పై నిర్బయ తో పాటు నాలుగు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు..కేసు నమోదు చేసిన తర్వాత సంజయ్ ను అరెస్ట్ చేయడానికి ఇంటికి వెళ్లగా సంజయ్ అప్పటికే అజ్ణాతంలోకి వెళ్లిపోయారు…గత నాలుగు రోజుల నుంచి సంజయ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు…ఈ నేపథ్యంలోనే సంజయ్ హైకోర్ట్ లో క్వాష్ పిటిషన్ వేయగా…పిటిషన్ ను విచారించిన కోర్టు కోట్టేసింది. దీంతో సంజయ్ మరింత ఇరాకటంలో పడినట్లు అయింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*